ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్ఐ బాలు నాయక్
మునగాల, జూలై 08(జనంసాక్షి): మునగాల మండలంలో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ బాలు నాయక్ హెచ్చరికలు శుక్రవారం జారీ చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగిన ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ వర్షాకాలంలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని అనవసరంగా వచ్చి ప్రమాదాల బారిన పడ వద్దని, సరదాగా చాపల వేటకు వెళ్లరాదని తెలిపారు. రైతులు కూడా పొలం పనులకు వెళ్ళినప్పుడు వాగులు వంకలు దాటి వెళ్లవద్దని రైతులు తమ పశువులను ఇంటివద్దనే ఉంచుకోవాలని ఇంటి దగ్గర ఉన్న మహిళలు బట్టలను ఉతికి ఇనుప తీగల మీద వేయకూడదని తమ పిల్లలను బయటికి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.