ప్రజలు బాబుని శాశ్వతంగా తిరస్కరించారు: శైలజానాథ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ప్రజలు శాశ్వతంగా తిరస్కరించారని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. గత ఎన్నికల్లో అన్ని ఉచితమని హామీ ఇచ్చినా ఓటమి చవిచూశారు. ఇప్పుడు మళ్లీ అధికారమిస్తే అన్నీ మార్చేస్తామని చెప్పడంపై వివరణ ఇవ్వాలన్నారు. అధికారంలోకి వస్తే ఇప్పటి సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు రద్దు  చేస్తారా? ప్రతిపక్ష నేతగా విఫలమైన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఆ హోదా కూడా దక్కదని చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మధ్య విభేదాలుంటే వారే పరిష్కరించుకుంటారన్నారు.