ప్రజల పక్షాన పోరాడితే.. అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు. b
తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.
రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం.
తాండూరు ఆగస్టు 23 (జనం సాక్షి)ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ విమర్శించారు.ఆరు మసాల క్రితం డీజిల్, పెట్రోల్ , గ్యాస్ ధరలకు నిరసనగా తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అంబెడ్కర్ చౌక్ లో నిర్వహించిన ధర్నా కు పోలీసులు, తెరాస ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి మంగళవారం కోర్టుకు హాజరుపర్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు. కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడు ప్రజా సమస్యలపై పోరాటం చేసి అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదని తేల్చి చెప్పారు నిరంతరం ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, సీనియర్ నాయకులు బాతుల వెంకటేష్, భీమశంకర్ ,మక్సుద్ తదితరులు ఉన్నారు.