ప్రజల రవాణాకు ఇబ్బంది కలిగిస్తున్న రోడ్డు

జైనథ్ జనం సాక్షి జులై 8
జైనథ్ మండలం లో లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది అత్యవసర సమయంలో హాస్పిటల్స్ వెళ్లాలన్న వాహనదారులు రోడ్డు బాగాలేదని ఎవరు తీసుకెళ్లడం లేదు ఆర్టిసి బస్సు 6  సార్లు వచ్చే బస్సు రోడ్డు బాగా లేకపోవడం వలన 2 సార్లు వస్తుంది లక్ష్మీపూర్ లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ లక్ష్మీపూర్ రోడ్డు ఇలా ఉందని వేరే గ్రామం వారు అంటుంటారు. పై రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మీపూర్ రోడ్డు గురించి ఎంపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన  లక్ష్మీపూర్ రోడ్డు మాత్రం కొన్ని సంవత్సరాల నుండి గుంతల మయం అయి ఉంది . ఎవరు బాగు చేస్తారు ఎప్పుడు బాగు  చేస్తారో అని వేయి కళ్లతో లక్ష్మీపూర్ గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.