ప్రజల వద్దకు ఆర్టీసీ ప్రోగ్రాం
ఆర్టీసీ సంస్థకు ప్రయాణికులేనిది
జనం సాక్షి శంకరపట్నం,శంకరపట్నం మండల కేంద్రంలోని మినీ బస్టాండ్ లో శుక్రవారం ప్రజల వద్దకు ఆర్టీసీ పోగ్రామును హుజురాబాద్ డిపో మేనేజర్ పి అర్పిత ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రజాకవి కాలోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థను ప్రయాణికుల సహకారంతో విజయవంతం చేయడం జరిగిందన్నారు.ప్రయాణికుల అండదండలతోనే ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో నడుస్తుందన్నారు.ఇందుకు ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించడం జరుగుతుందన్నారు.ప్రయాణికులే ఆర్టీసీ సంస్థకు సంపదగా ఆమె అభివర్ణించారు.ప్రయాణికులకు రాయితీ కల్పించే విధంగా కేశవపట్నం గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. కేవలం 330 రూపాయలతో తిరుపతికి స్పెషల్ దర్శనం కోసం వెళ్లవచ్చన్నారు సిటీలో 24 గంటలు ప్రయాణించే అవకాశం ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.ప్రయాణికుల అండదండలతో ఆర్టీసీ సంస్థ అన్ని రంగాలలో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.ఆర్టీసీ బస్సులో ప్రతి ఒక్కరు పర్యాయనించి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బస్టాండ్ ఇన్చార్జి గుర్రం స్వామి గౌడ్,బండారి తిరుపతి,మాజీ ఎంపీటీసీ గుర్రం రామస్వామి గౌడ్,కొత్తపెళ్లి రవి ప్రయాణికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.