ప్రజావాణి దరఖాస్తులను త్వరిత గత్తిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్.
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
ప్రజావాణి లో వచ్చిన అభ్యర్ధన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ లు స్వీకరించి ఆయా సమస్యలకు సంబంధించిన ఆర్జీలను సరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు . పించన్లు, భూ సమస్యలు, ధరణీ లో పెండింగులో ఉన్న అర్జీలు, ఉపాధి, తదితర అంశాలకు సంబందించిన అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజావాణి లో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్. ఎస్. నటరాజ్, ఆర్టీఓ రమేష్ రాథోడ్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.