ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు: వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
మా మీన్ పేట సెప్టెంబర్ 19 జనం సాక్షి
ప్రజా సంక్షేమ పాలన కు ఆకర్షితు లై టిఆర్ఎస్ పార్టీలో గ్రామ గ్రామాల్లో చేరుకున్నా రని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు సోమవారం స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో వారి నివాస ఆవరణలో బంట్వారం మండల పరిధిలోని బంట్వారం గ్రామం, రొంపల్లి మరియు నాగ్వారం గ్రామాలకు సంబంధించిన వివిధ పార్టీలకు చెందిన యువ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఫెరోజ్, చంద్రశేఖర్ రెడ్డి, అశోక్, శ్రీనివాస్, లింగమూర్తి, వెంకటేశం, నవాజ్, రాజు, ఆశం, షబ్బీర్, పాషా మరియు వారి అనుచరులు 60 మంది* మైనారిటీ నాయకులు, యువనాయకులు ఎమ్మెల్యే గారి సమక్షంలో టిఆర్ఎస్ చేరారు ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, టిఆర్ఎస్ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షు లు రాములు యాదవ్ ఏసిఎస్ వై స్ చైర్మన్ సుధాకర్ గౌడ్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.