ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలి.

బి జె పి అధ్వర్యంలో జండాల పంపిణి..
తాండూరు ఆగస్టు 11 (జనం సాక్షి) ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలని 75 వసంతాల స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆజాది క అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా
శుక్రవారం తాండూరులో జెండాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పులగం తిరుపతి మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా
మువ్వన్నెల పతాకాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై జెండాను ఎగురవేయాలని కోరారు. ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిదర్ గౌడ్, పులుగం తిరుపతి, విష్ణు, చిన్నయ్య ,శ్రీనివాస్, సాయి పాల్గొన్నారు