ప్రతి కార్యకర్తకు అండగా టీఆర్ఎస్ పార్టీ..ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
సారంగపూర్ (జనంసాక్షి) సెప్టెంబర్ 24
తెలంగాణ రాష్ట్రసమితి కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబసభ్యులకు పార్టీ అండగా నిలుస్తోందని అన్నారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని అన్నారు.సారంగా పూర్ మండల పోచం పెట్ గ్రామానికి చెందిన బట్టు గంగన్న ఇటీవల రంగపెట్ వద్ద రోడ్డు ప్రమాదం లో మరణించగా ఆయన భార్య బట్టు గంగమ్మ కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోనా పూర్ రైతు వేదిక లో 2 లక్షల రూపాయల టీఆరెఎస్ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ చెక్కు అందజేశారు.గంగన్న మరణం తో వారి కుటుంబానికి పార్టీ అండగా నిలిచి సహాయంగా 2 లక్షలివ్వటంతో కుటుంబసభ్యులకు ఆర్దికంగా ఉపశమనం లభిస్తుందని అన్నారు.