ప్రతి కాలనీలో చెత్త చెదరం లేకుండా చేస్తాం కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 19

అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ శానిటేషన్ సిబ్బంది స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో పలు అంశాలపై చర్చించారు. ప్రతి కాలనీలో చెత్త చెదారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్మికులదే అని కార్పొరేటర్ తెలియజేశారు. సరైన సిబ్బంది గాని ఆటో రిక్షాలు కానీ లేకుంటే తనకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అల్వాల్ నాగమణి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ హేమలత సూపర్డెంట్ హరి బాబు తో పాటు స్థానిక నాయకులు అనంతుల సంతోష్, ఈశ్వర్ గౌడ్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.