ప్రత్యమ్నాయ పంటలపై హచ్చరికలు
సాగర్ ఆయకట్టు రైతుల్లో అయోమయం
యాసంగి పంటల కోసం సమాయత్తం
నల్లగొండ,నవంబర్11(జనం సాక్షి): సాగర్ జలాశయం కళకళలాడుతుండడంతో ఆయకట్టు రైతాంగం యాసంగికి సన్నద్ధమవుతోంది. అయితే వరి వేయవద్దని ప్రభుత్వం హెచ్చరిక చేయడంతో రైతులు ఆయోమయంలో పడ్డారు. ప్రత్యమ్నాయా పంటలపై వారు తర్జనభర్జన పడుతున్నారు. తమకు అలవాటుగా మారిన వరినే ఎంచుకునేందుకు సిద్దం అవుతున్నారు. సాగర్ నీటి విడుదలకు అందుకనుగుణంగా రైతాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో లక్ష హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా. డెడ్స్టోరేజీలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయకట్టుకు నీరు విడుదల చేసిన చరిత్ర ఉండడంతో.. అదే అంచనాలు, ఆశలు నెలకొన్నాయి. ఇప్పుడు సాగర్‌లో పూర్తిస్థాయి నీరు ఉండడంతో యాసంగి పంట ప్రణాళిక సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా లక్షన్నర హెక్టార్లలో వరి సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. దీనికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తోంది. సాగర్ నుంచి యాసంగి నీటివిడుదలపై కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డు సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. ఆమేరకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. గతంలో సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని వానాకాలం సీజన్లో బోరు బావుల, ఆధారంగా వరిసాగు చేసిన పంటలు తీరా చేతికొచ్చే సమయంలో నీటి తడులు లేక ఎండుదశకు చేరుకున్నాయి. సీజన్ మొదటలో వర్షాభావం, భూగర్భ జలాలు పడిపోవడం, ప్రాజెక్టు కాల్వల కింద నీరు అందుబాటులో లేకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. సాగర్‌కు జలకళ రావడం, వెంటనే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక యాసంగి పంటలకూ ఢోకాలేదు. వర్షాభావం, భూగర్భ జలాలు పడిపోవటం, ప్రాజెక్ట్ కాల్వల కింద సాగు నీరు అందుబాటులో లేకపోవడంతో వంటి కారణాలతో గతంలో వానాకాలంలో పంటల సాగు ఆశించిన స్థాయిలో జరుగలేదు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నాయి. వరికి దోమపోటుతో మరింత నష్టం వాటిల్లింది.ప్రభుత్వం 24గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో పంటలను కాపాడుకోగలిగామని రైతులు చెబుతున్నారు. వరి సాగు కావల్సిన కాంప్లెక్స్ ఎరువులు, యూరియాను అందుబాటులో ఉంచేలా అందుకనుగుణంగా కావల్సిన ప్రణాలికలను అధికారులు రూపొందిస్తున్నారు. సాగునీటితో పాటు జంట నగరాలకు, జిల్లాలోని తాగునీటి అవసరాలకు, చెరువులను నింపేందుకు సరిపోతుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సాగర్‌కు జలకళ సంతరించుకోవడంతో అన్నదాతల్లో ఆనందం నిండుకుంది.