ప్రత్యర్థుల పనిపట్టేందుకే దర్యాప్తు సంస్థలా ?
శరద్ పవార్ ఆరోపణల్లో ఆంతర్యం
కెసిఆర్ ప్రశ్నలకు బిజెపి సమాధానం ఇచ్చేనా
న్యూఢల్లీి,అక్టోబర్20( (జనం సాక్షి)): విపక్ష పార్టీ నేతలను కేసుల్లో ఇరికిస్తున్నారని, దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని ఎన్సీపి నేత శరద్ పవార్ ఇటీవల చేసిన ఆరోపణలు తాజా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అవినీతిపై కాకుండా విపక్షాలపై కక్షతీసుకునే స్వాభావం ఉందని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికై నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే అభిప్రాయం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏర్పడిరది. అవినీతి, నల్లధనం విషయంలో రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందినవారిపై మాత్రం ఈగ కూడా వాలడం లేదు. దీనినిబట్టి చూస్తుంటే విపక్షనేతలను, విపక్ష పార్టీల సిఎంలను కూడా టార్గెట్ చేశారని అర్థం చేసుకోవాలి. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కూడా ఒకరిద్దరు స్థానిక బీజేపీ నాయకులు ఇలాంటి ప్రకటనలే చేయడంతో ఆయనకు గట్టిగానే జవాబిచ్చారు. ఎన్నికలలో ఖర్చు చేయడానికి, పార్టీ నిర్వహణకు భారతీయ జనతా పార్టీకి నిధులు ఎలా వస్తున్నాయో తనకూ అలాగే వస్తున్నాయని కేసీఆర్ గట్టి కౌంటర్ ఇవ్వడంతో స్థానిక బీజేపీ నాయకుల నోళ్లు మూసుకున్నారు. గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా రాష్టాన్రికి అంత ఇచ్చాం? ఇంత ఇచ్చాం అని చెప్పారు. దీనికి మండిపడ్డ కేసీఆర్, విలేకరుల సమావేశం పెట్టి మరీ అమిత్ షాను కడిగిపారేశారు. విూ ఇంటినుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. సమాఖ్య స్ఫూర్తి మేరకు రాస్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా మాత్రమే చెల్లించారని ఎదురుదాడి చేశారు. ఇటీవల అసెంబ్ల సమావేశాల్లో కూడా కెసిఆర్ పన్నులపై గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇతర నేతలు కేసీఆర్ మాట్లాడినంత గట్టిగా, ఆ ధోరణిలో మాట్లాడలేకపోతున్నారు. అయినా బిజెపి టార్గెట్‌లో తెలుగు రాష్టాల్రు ఉన్నాయి. ఇక్కడ పాగా వేయాలంటే ముందు ఇక్కడ బలంగా ఉన్న నేతలను దెబ్బతీయాలి. అలా చయాలంటే అవినీతి ముద్ర వేయాలి. అందుకే కాబోలు తొలుత చంద్రబాబుపై ఈ అస్త్రం ఎక్కుపెట్టారు. అయితే బీజేపీ నాయకుల మాటలను బట్టి ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఓడిపోవాలంటే ఆయనను అప్రతిష్ఠపాల్జేయాలి కనుక అందుకు ఏమి చేయాలో అవన్నీ చేసారు. కానీ జగన్ వచ్చాక అంతకు మించి అన్న చందంగా ఎపిలో ఇప్పుడు అవినీతి రాజ్యమేలుతోంది. అలాగే అప్పుల కుప్పగా మారింది. కెసిఆర్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తే అంతకు రెండిరతలు కెసిఆర్ రెచ్చిపోయి బిజెపిని ప్రజల్లో ఎండట్టగలిగే సత్తా ఉంది. అందుకే ఆయన ఫెడరల్ వ్యవస్థపై కేంద్ర రాస్ట్రాల సంబధాలపై పదేపదే చర్చించాలని గుర్తు చేస్తున్నారు. నిజానికి కెసిఆర్ గట్టిగా నిలబడితే నిధుల విషయంలో కేంద్రంలోని బిజెపి నేతలు నీళ్లు నమలాల్సి రావచ్చు.