ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీలపై చర్చ
హైదరాబాద్: సెప్టెంబరులో జరిగే ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గురించి మాత్రమే చర్చిస్తామని మంత్రి రఘువీరా తెలియజేశారు. గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవాన్ని మంత్రులు రఘువీరా, శైలజానాధ్‌లు ప్రారంభించారు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసమే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చట్టం తీసుకొచ్చేందుకు యత్నిస్తోందని రఘువీరా అన్నారు. ఆయా జాతుల జనాభా నిష్పత్తిని అనుసరించి ఉప ప్రణాళికలో నిధులు కేటాయిస్తామని మంత్రి శైలజానాధ్ అన్నారు. నిమ్నజాతుల్లో ఎంతో మంది మహోన్నతులుగా పేరుతెచ్చుకున్నా అభివృద్ధి మాత్రం వారి దరి చేరలేదన్నారు. చెంచుల్ని ఒలింపిక్స్‌కు పంపిస్తే షూటింగ్‌లో బంగారు పతకాలు సాధిస్తారని శైలజానాధ్ వ్యాఖ్యానించారు.