ప్రత్యేక హోదా సాధన జగన్‌తోనే సాధ్యం

– రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది
– మాజీ ఎంపీ వరప్రసాద్‌
న్యూఢిల్లీ, ఆగస్టు3(జ‌నం సాక్షి) : ప్రత్యేక హోదా సాధన ఒక్క జగన్‌తోనే సాధ్యమవుతుందని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది ఒక్కజగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ పార్టీయేనని తిరుపతి వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఎంపీగా రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎంపీగా రాజీనామా చేసినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ¬దా కేవలం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేక ¬దా కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక ¬దా కోసం తాము రాజీనామా చేశామని, ఆ విషయం ప్రజలకు తెలుసునని అన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రత్యేక ¬దా హావిూ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాయని ఆరోపించారు. కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తీసుకురాలేదు..అందుకే బీజేపీ ప్రత్యేక ¬దా ఇవ్వలేదని విమర్శించారు. లోక్‌సభలో తామే ముందు అవిశ్వాస తీర్మానం పెట్టామని..కానీ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేశామని తెలిపారు. కేంద్రమంత్రులను, అధికారులనూ తాను కలుస్తున్నానని చెప్పారు. ఓఎన్‌జీసీ అధికారులను కలిసి వాటర్‌ ఎ/-లాంట్‌ ఏర్పాటు చేయాలని కోరాను..ఆరోగ్య మంత్రిని కలిసి రూయా ఆసుపత్రికి రూ.50 కోట్లు, స్విమ్స్‌కి రూ.50 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. మా సమయం వృథా కానివ్వకుండా ప్రత్యేక ¬దా కోసం ప్రజలతో కలిసి పోరాడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఎంపీలం కాకపోయినా నిథుల కోసం మంత్రులు, అధికారులను కలుస్తున్నామని వివరించారు. వైఎస్‌ జగన్‌ వల్లే ప్రత్యేక ¬దా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కడప స్టీల్‌ ఫ్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, ఎయిర్‌పోర్టు కావాలంటే..ఒక డైనమిక్‌ లీడర్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు.