ప్రథమ స్థానంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ సర్వీస్

మహాదేవపూర్ ఆగస్టు 27 (జనంసాక్షి)
నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా 75 స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని మంగళంపల్లి హుస్సేన్  ఆధ్వర్యంలో  హైదరాబాద్ బాబు జగ్జీవన్ రావు ఆడిటోరియంలో  .జరిగిన సెమినార్ అవార్డు ప్రోగ్రాంలో ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుప్రథమ స్థానం వరించింది. జిల్లాకు ప్రధాన బహుమతి రావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందిని మహాదేవపూర్ మండల యువకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్స్యూమర్ సెల్  ప్రెసిడెంట్ నీర్ల ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.మహదేవ్ పూర్ మండల్ ప్రెసిడెంట్ నీర్ల జీవన్. పలిమెల మండల్ ప్రెసిడెంట్ మేడిగడ్డ మధుకర్ లను శాలువాతోఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపుర్ యువకులు  తదితరులుపాల్గోన్నారు.