ప్రదాని మన్మోహన్‌కు కేసీఆర్ లేఖ
హైదరాబాద్: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు లేఖ రాశారు.బయ్యారం గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆ లేఖలో కేసీఆర్ ప్రధానికి తెలిపారు.ఏ ప్రాంత వనరులను మెదట ఆ ప్రాంతానికే దక్కాలన్న సహజ న్యాయసూత్రాల ప్రకారమైన బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రధానికి కోరారు.ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడీ,వివక్షకుగురైందని ఆ లేఖలో కేసీఆర్ పేర్కోన్నారు.