ప్రధానమంత్రి గారు.. రెండు కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు
– యూత్ కాంగ్రెస్ వరంగల్ తూర్పు ఇంచార్జ్ రాజ్ కుమార్
– కరీమాబాదులో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 17(జనం సాక్షి)
ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని వరంగల్ తూర్పు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సింగరి రాజ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం కరీమాబాద్ అంబేద్కర్ భవనం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు అలాగే జాతీయ నిరుద్యోగ దినోత్సవం గా ప్రకటించుకున్నారు .నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు
ఈ సందర్బంగా సింగరి రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాటపై ఏందుకు నిలబడలేకపోయారని ప్రశ్నించారు.ఖాళీగా ఉన్న ఉద్యోగాల పై కేంద్ర ప్రభుత్వం వేంటనే శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని, అన్ని ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని , మరియు ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటించి, నూతన ఉద్యోగ, ఉపాధిని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో నిరుద్యోగు యువత కు బాసట గా నిలుస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ లకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలు చేస్తామని మరియు ఉద్యోగ నోటిఫికేషన్ లు లేక కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ,కుటుంబంలో ఒక యువకుడికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఒక తరం ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఆ కుటుంబం భరోసా తో బ్రతక గలుగుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు
Attachments area