ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మాతా శిశు ఆసుపత్రిలో అల్పాహారం. పండ్లు పంపిణీ.

తాండూరు ఆగస్టు 19 (జనం సాక్షి)ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తాండూరు లోని మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణులకు అల్పాహారం మరియు పండ్లు పంపిణీ చేశారు,
శుక్రవారం ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి విదులు నిర్వహించే వైద్యులు అనిల్ కుమార్ పూలమాలవేసి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ని గర్భిణులకు అల్పాహారం మరియు పండ్లు పంపిణీ  చేశారు.అదేవిధంగా రైల్వే స్టేషన్ ప్రాంతంలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నరేష్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు శరణు బసవేశ్వర్, నాసిర్, అంబాదాస్,వీరన్న, హీరాలాల్ తో పాటు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.