ప్రభుత్వం విఆర్వో విఆర్ఏల డిమాండ్లను నెరవేర్చేవరకు నిరవధిక సమ్మె.

నెరడిగొండ జులై29(జనంసాక్షి): అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్వో విఆర్ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వివిధ సన్నివేశాల్లో నిరంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని విఆర్వో,విఆర్ఏ మండల జేఏసీ నాయకులు పేర్కొన్నారు.శుక్రవారం రోజున అర్ధలగ్నంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం ప్రకారం గ్రామ సేవకుల అన్ని విధాల  డిమాండ్లను ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇస్తేనే సమ్మెను నిలిపివేస్తామని లేని పక్షంలో నిరవధిక సమ్మెను నిత్యం కొనసాగిస్తామని అన్నారు.ప్రభుత్వం గ్రామ సేవకులకు పిలిపించి చర్చల ద్వారా వారి డిమిండ్లను పరిష్కరించాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు యధావిధిగా విధులకు హాజరుకాకుండా నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.