ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన.ఏజెన్సీ డి ఎంహెచ్ఓ మనోహర్.
(జనం సాక్షి)
మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఏజెన్సీ డిఎంహెచ్ఓ కుడ్మేత మనోహర్ సందర్శించారు.ఆసుపత్రిలో ప్రసూతి రోగుల వివరాల పట్టిక సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.అనంతరం మందుల స్టాక్,మహిళా ప్రసవాల గదిని తనిఖీ చేశారు.సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని మందుల కొరత లేకుండా ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి వైద్యం అందించాలని, వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలని వైద్య సిబ్బందినీ అదేశించారు. తరుచూగా ఆసుపత్రిలో గదులను పరిసరాలను శానిటైజర్ చేయాలనీ సూచించారు.వారి
వెంట హెచ్ఈఓ నాందేవ్,సిబ్బంది గోకుల్,కైలాష్ తదితరులు ఉన్నారు.
Attachments area