ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవలు జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా మెడికల్ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు .. అంటువ్యాధుల నిరోధక , కోవిడ్ పరిక్షలు, కోవిడ్ వ్యాక్సినేషన్, అసంక్రమిత వ్యాధుల పరీక్షలు, క్షయ వ్యాధి, కుష్టు వ్యాధి, టి-హబ్, ఇమ్యునైజేషన్, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల, రవాణా సౌకర్యం లేని గ్రామాలలోని గర్భిణీలను ప్రసవ సమయానికి ముందే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి.. సుఖ ప్రసవం జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. రామన్న మూడు మాసాల వరకు వైద్యులు అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాత శిశు సంరక్షణ నమోదు సక్రమంగా నిర్వహించాలని, నిర్ణీత సమయానికి వైద్య సహాయం అందించాలని అన్నారు. గర్భవతి అయినప్పటి నుండి ప్రతి మాసం వైద్య పరీక్షలతో పాటు వైద్యం అందించాలని అన్నారు. రక్త హీనతతో బాధ పడకుండా అవసరమైన మందులు అందించాలని, హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్న వారికి రక్తం అందించాలని సూచించారు. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రై కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. వచ్చే మూడు మాసాలు కీలకమని, దోమలవ్యాప్తి నిరోధానికి రసాయనాలు చల్లాలని సూచించారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రతి మండలంలో ఆసుపత్రి కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించాలని అన్నారు.. ముఖ్యంగా సికాషన్ డోప్ పై ప్రజలకు వివరించాలని సూచించారు. అసంక్రమిత వ్యాధులు ప్రబలకుండా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. క్షయ వ్యాధి, కుష్టు వ్యాధి నిర్ములనకు చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందించాలని అన్నారు. రోగనిరోధక టీకాలను సరైన సమయానికి అందించాలని అన్నారు. తెలంగాణ వాటి లో పరీక్షలు నిర్వహించి నివేదికలు సకాలంలో ఆయా ఆసుపత్రులకు పంపించాలని అన్నారు. హబ్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, స్థానిక సర్పంచ్ లు, ప్రజాప్రతినిధుల సహకారంతో గర్భిణీలను ప్రసవాల కొరకు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైన  గర్భిణీలకు ప్రసుతః అయ్యే వరకు అన్ని సౌకర్యాలు స్థానిక గ్రామపంచాయితీల నుండి సమకూర్చాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాస వాలు జరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఉట్నూర్ అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మనోహర్ మాట్లాడుతూ, రక్త హీనతతో బాధ పడుతున్న గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి. అవసరమైన ఏశిలలో రక్తం ఎక్కించాలని అన్నారు. గర్బిణీ స్త్రీలకు బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ప్రసవ మరణాలు అరికట్టే విధంగా మెడికల్ ఆఫీసర్ లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సాధన. మాతా శిశు సంరక్షణ అధికారి డా.పచెస్, డా.శ్రీకాంత్, మెడికల్ ఆఫీసర్ ఆఫీసర్లు. తదితరులు పాల్గొన్నారు.