ప్రభుత్వ బి సి వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అండగా ఉంటా…

మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త.
తాండూరు అగస్టు 13(జనంసాక్షి)ప్రభుత్వ బి సి వసతి గృహం లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అండగా ఉంటానని
మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త పేర్కొన్నారు.శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని బిసి బాలుర వసతి గృహంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న అక్కడి విద్యార్థులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ
విద్యార్థులకు తోబుట్టువులు లేక  కుటుంబ సభ్యులు కూడా రాకపోవడంతో  విద్యార్థులు వసతి గృహంలో ఉన్నారని అలాంటి వారికి నేను తోబుట్టువుగా ఉంటానని రాఖీ కట్టామని తెలిపారు. విద్యార్థులకు రాఖీ కట్టడంతో వారి ముఖంలో చిరునవ్వు కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు కష్టపడి చదువు కొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కష్టపడి చదువుకుని తమ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు.బిసి వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి బాలుర వసతిగృహం ఉపాధ్యాయులు శ్రీశైలం,
 విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.