ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛ శానిటేషన్ నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
ఈనెల 5 నుండి 11 వరకు జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో స్వచ్ఛ శానిటేషన్ డ్రైవ్ పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టరు  పమేలా సత్పతి సంబంధిత ప్రిన్సిపాల్స్ కు సూచించారు.
శనివారం నాడు జిల్లా కలెక్టరు ఛాంబర్లో స్వచ్ఛ శానిటేషన్ డ్రైవ్ పై రూపొందించిన పోస్టర్స్, బ్రోచర్స్ ను ఆమె విడుదల చేశారు. తరగతి గదులలో ఫాన్స్, ట్యూబ్ లైట్స్ తో సహా టాయిలెట్స్, డార్మినేటర్స్, గౌండ్స్ శుభ్రం చేయాలని, అవసరమైన చోట వైట్ వాష్ వేయించాలని, పరిసరాలలో పారిశుద్య చర్యలు చేపట్టి ప్రతి పాఠశాలను తీర్చిదిద్దాలని, ప్రతి విద్యార్థి చేత ఒక మొక్క నాటించాలని, ప్రతి రోజూ అధికారులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని, విద్యార్థులలో పరిసరాల పరిశుభృత పట్ల అవగాహన పెంపొందించాలని అన్నారు. జిల్లా స్థాయిలో స్వచ్ఛ శానిటేషన్ పోటీలలో మొదటి బహుమతిగా 20 వేలు,  రెండవ బహుమతిగా 15 వేలు, మూడవ బహమతిగా 10 వేలు ఇవ్వబడుతుందని తెలిపారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ శ్రీరాం శ్రీనివాస్, ఎస్. రూప, జి.కల్పన, స్వర్ణరత్నం, సునీత,  నర్సింహ్మచారి, భిక్షమయ్య,  స్పందన పాల్గొన్నారు