నేరడిగొండజూలై30(జనంసాక్షి):మండలంలోని కుంటాల జలపాతంకు వెళ్లే రహదారికి సావుర్గాం సమీపంలో ఉన్న లోవంతెన ఇటీవల కురిసిన భారీ వర్ష వరదలకు రోడ్డు వంతెన కోతకు గురై గుంతలు ఏర్పడి రాకపోకలకు వాహన చోదకులకు ఇబ్బందికరంగా మారింది.ఉన్నతాధికారులు వచ్చారు చూసి మరిచారు.జనం గోసచూసి ముందస్తుగా ప్రమాద నివారణకు చర్యలు ఆదివారం రోజున స్థానిక జడ్పిటిసి అనిల్ జాదవ్ వారి సొంత ఖర్చులతో రోడ్డు వంతెనపై ఉన్న గుంతలను మొరం మట్టిలో పూడ్చి తాత్కాలిక మరమ్మత్తులు చేయించడంతో వాహన చోదకులు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇట్టి కార్యక్రమంలో సావుర్ గాం సర్పంచ్ జాధవ్ కల్యాణి మహేందర్ నాయకులు తదితరులు ఉన్నారు.