ప్రశాంత వాతావరణంలో గణేష్ చతుర్థి. నిమజ్జనోత్సవం నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ బ్యూరో జనం సాక్షి
ప్రశాంత వాతావరణంలో గణేష్ చతుర్తి, నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సంబంధిత అధికారులందరూ శాంతి కమిటీ సభ్యులు సూచనలు,సలహాలు అనుసరించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
గురు వారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గణేష్ చతుర్తి,నిమజ్జనం ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ శాంతి సంఘం సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ని జరుపుకోవాలని ఆయన అన్నారు. విగ్రహాలు ఏర్పాటు కు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని అన్నారు.
గణేష్ మండపాలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మండపాలు నాణ్యమైన వైరింగ్ ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని,విద్యుత్ శాఖ నుండి 1000 రూ.లు డి.డి.కట్టి విద్యుత్ సరఫరా కు మండపాలు ఏర్పాటు చేసే వారు అనుమతి తీసుకోవాలని అన్నారు .విద్యుత్ శాఖ నుండి సిబ్బంది ప్రతి మండపం ను సందర్శించి ప్రమాదాలు జరగకుండ టెక్నికల్ గా సూచనలు అందించి విద్యుత్ కనెక్షన్ ఎర్పాటు చేసేలా చూడాలని అన్నారు .విగ్రహాలు పెట్టే మండపాలు ఏర్పాటు,నంబరింగ్ చేయాలని అన్నారు.నిమజ్జనం ప్రాంతాలు అర్.డి. ఓ.లు పోలీస్ శాఖ,శాంతి కమిటీ,ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించి గుర్తించి నిమజ్జనం రోజున అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.నిమజ్జనం ప్రాంతాల వద్ద అర్&బి శాఖా బారికేడింగ్,తగినన్ని క్రేన్ లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిమజ్జన పాయింట్ లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీలలో ,గ్రామాలలో మండపాల వద్ద,నిమజ్జనం వద్ద శానిటేషన్ ప్రతి రోజూ పకడ్బందీగా నిర్వహించాలని,నిమజ్జనం రోజున త్రాగు నీరు ఏర్పాటు కు మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.వైద్య శాఖ వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు.సోషల్ మీడియా లో తప్పుడు పోస్ట్ లపై నియంత్రణ పాటించి సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని అన్నారు
ఉత్సవాల నిర్వహణకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు .ఉత్సవాల నిర్వహణకు ఆయా శాఖల తరఫున పూర్తి సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. నిమజ్జనం రోజున ఎక్కువ సంఖ్య లో ప్రజలు గుమి కూడే అవకాశం వుందని,కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు మాస్క్ లు దరించేలా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు.అన్నారు.ప్రతి మండపం వద్ద పెద్ద విగ్రహాలు ఉన్న చోట మండపం వద్ద అగ్ని ప్రమాదాలు రాకుండా ఫైర్ ఎక్స్టింగ్వి షర్ లు ఏర్పాటు చేయాలని,దాతలు ముందుకు వస్తె వారి పేరు న ఏర్పాటు చేయాలని అన్నారు. మట్టి విగ్రహాలు ఏర్పాటుకు సభ్యులు అవగాహన కలిగించాలని అన్నారు
జిల్లా ఎస్. పి. రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ఏలాంటి సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ఇందుకుగాను అందరు పూర్తి సహకారం అందించాలని ,పోలీసు శాఖ తరపున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైక్ లను ఉపయోగించాలని,డి జే లకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ శాఖ ద్వారా అధికారికంగా తీసుకోవాలని చెప్పారు .ఈ సంవత్సరం విగ్రహాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని అన్నారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు శాంతి కమిటీ లు,ఉత్సవ కమిటీ లు ఏర్పాటు చేసుకోవాలని,యువతను కూడా బాగ స్వాములు చేయాలని అన్నారు. వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ఇబ్బందులు రాకుండా నిమజ్జనం రోజున ట్రాఫిక్ మళ్లింపు కు పోలీస్ శాఖ ముందే తెలియజేస్తామని, వినాయక మండపాల ఏర్పాటు నిర్వహణ కమిటీలు పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఉత్సవాల సందర్బంగా ఎలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపారు. ప్రతి మండపం వద్ద మండపం,కమిటీ సభ్యులు రాత్రి సమయం లో వుండాలని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అన్ని మతాలు కలిసి మెలిసి మత సామరస్యానికి భంగం కలగకుండా పండుగలు, ఉత్సవాలు జరుపు కుంటున్నమని అన్నారు.ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ సునిశిత దృష్టి పెట్టి శాంతి యుత వాతా వరణం లో నిర్వహించు కునెలా చర్యలు తీసుకోవాలని అన్నారు.మండపాల వద్ద దీపాలు పెట్టే టప్పుడు ప్రమాదం జరగ కుండ గ్లాస్ పెట్టీ జాగ్రత్త లు తీసు కోవాలని సూచించారు.
శాంతి కమిటీ సభ్యులు,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పలువురు మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన శానిటేషన్ చర్యలు చేపట్టాలని, రహదారుల గుంతలు పూడ్చి మరమ్మతు చేయించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీరు, నిమజ్జనం రోజున నిమజ్జనం పాయింట్ ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కోవిడ్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ,బెల్ట్ షాపులు నియంత్రించాలని,సోషల్ మీడియా లో విద్వేషాలు రెచ్చ గొట్టే వారిపై పోలీస్ శాఖ నిఘా పెట్టాలని,ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. సమావేశం లో అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ,భాస్కర్ రావు,అర్.డి. ఓ లు, డి.ఎస్.పి.లు,మున్సిపల్ కమిషనర్ లు,వివిధ శాఖ ల అధికారులు,శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు