ప్రాథమిక ఉపాధ్యాయులకు మూడురోజుల తొలిమెట్టు శిక్షణ..

నెరడిగొండ జులై30(జనంసాక్షి): మౌలిక భాష గణితం తెలుగు ఇంగ్లీష్ పరిసరాల విజ్ఞానం విషయం సామర్థ్యల సాధనపైన  ప్రాథమిక ఉపాధ్యాయులకు మొదటి స్టేపు మూడు రోజుల శిక్షణ తరగతులతో ఉపాధ్యాయులకు బోదనభ్యసంపై పట్టు సాధిస్తాని మండల విద్యాధికారి  భూమరెడ్డి అన్నారు.శనివారం మొదటి రోజు తొలిమెట్టు శిక్షణ కార్యక్రమంలో బాగంగా మండలంలోని పలు పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు.వారికి ఎంఆర్సిలు శిక్షణ తరగతులు నిర్వహించి ప్రణాలిక ప్రకారం ప్రాథమిక విద్య కనీస సామర్థ్యం అవగాహన కల్పించారు.