ప్రారంభైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బాడ్మింటన్‌ నాని ప్రసాద్‌ మెమోరియల్‌ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌.ఎం. హరీఫ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఈ వేదికను సద్వినియోగం చేసుకొని.. జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్‌ డీసీపీ రవివర్మ, ఎసీపీ అమరేంధర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ పోటీలు నేటి నుంచి ఈనెల 30 వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.