ప్రియాంక ట్విట్టర్‌కు భారీ స్పందన

లక్నో,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తురుపు ముక్కుగా భావిస్తున్న  ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల  ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా , తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన అనంతరం పూర్తిగా కార్యాచరణ ప్రణాళికలో దిగిపోయారు.  లక్నోలో నిర్వహించనున్న  మెగా రోడ్‌ షో కంటే ముందుగా సోషల్‌ విూడియాలో ఎంట్రీ ఇచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు పార్టీ సన్నాహకాల్లో భాగంగా  లక్నోలో నాలుగు రోజుల పర్యటన మొదలుకానున?న నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లోతన అధికారిక ట్విటర్‌ ఖాతాను  ఆమె ఓపెన్‌ చేశారు.  అంతే నిమిషాల్లో 22వేల  మందికి పైగా పాలోవర్లు ఆమె ఖాతాలో చేరిపోయారు. కాగా ప్రియాంక గాంధీ రాజకీయ రంగప్రవేశంపై  రాజకీయ వర్గాల్లో  ఎప్పటినుంచో నెలకొన్న ఉత్కంఠకు  రెండు వారాల  క్రితం తెరపడిన సంగతి తెలిసిందే.  క్రియాశీల రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పర?యటిస్తున్నారు. దీనిపై అటు కాంగ్రెస్‌  నాయకులు, శ్రేణులతోపాటు, ఇతర వర్గాల్లో కూడా  భారీ అంచనాలే ఉన్నాయి.