ప్రేమజంట ఆత్మహత్య

మెదక్‌, జనంసాక్షి: తమ ప్రేమను కాదని ఇష్టంలేని పెళ్లి చేశారనే వేదనతో ఓ యువతి తన ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనజగ్‌వ్‌పూర్‌ మండలం తీగుల్‌ నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసినందుకు మనస్థాపానికి గురైన హేమలత అనే యువతి ఆమె ప్రియుడు బాలరాజుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. మృతులిద్దరూ నల్గొగొండ జిల్లా తుర్కపల్లి వాసులని తెలిసింది.