ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్.
తాండూరు అగస్టు 13(జనంసాక్షి) ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగ అని యాలాల తహసీల్దార్ గోవిందమ్మ అన్నారు. శుక్రవారం రక్షా బంధన్ సందర్భంగా హాజీపూర్ గ్రామసర్పంచ్ శ్రీనివాస్ కు తహసీల్దార్ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీద, ధనిక వ్యత్యాసం లేకుండా కష్టాల్లో వెన్నంటే ఉండి ధైర్యాన్ని నూరిపూసేదే రక్షా బంధన్ అన్నారు. ఆపదలో ఆదుకునే ప్రతి ఒక్కరినీ సోదర సమానులుగా భావించాలన్నారు. మండల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Attachments area