ప్లాస్టిక్ అమ్మకాలపై కొరడా
వరంగల్,జూన్23(జనం సాక్షి): ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ప్లాస్టిక్‌పై సమర భేరి మోగించేందుకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. చాలాకాలంగా కూడా వేచి చూసే ధోరణితో ఉన్నప్పటికీ ఎంతకీ వ్యాపారుల్లో మార్పు రాకపోయే సరికి కార్యక్షేత్రంలోకి దిగారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు అమ్ముతున్న దుఖాణాలపై నేరుగా దాడులు నిర్వహిస్తున్నారు. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. దాడులు చేస్తే తమ వ్యాపారాలు సాగవని ఆదుకోవాలని నెత్తీ నోరు బాదుకుంటూ బ్రతిమాలారు. అయితే నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అన్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగే అతి తక్కువ మైక్రాన్లు కలిగిన మట్లిలో కరిగిపోలేని కవర్లను ఖచ్చితంగా నిషేధం విదించడమే అవుతుందని చెప్పినట్లు సమాచారం. ఇకపోతే ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్లాస్టిక్ నిషేధాన్ని ముందుగా పురపాలక శాఖ నుంచే పకడ్బందీగా చేపట్టాలనే నిర్ణయంతో ఇటీవలే అధికారులు, సిబ్బంది ఎవరూ నిషేధిక ప్లాస్టిక్ బ్యాగులు, సీపాలు ఇతరత్రా వస్తువులు వినియోగించరాదంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వీపీ గౌతమ్ శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది ఎవరూ కూడా కార్యాలయంలో వినియోగంచరాదని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. నిషేధిత ఎ/-లాస్టిక్ వస్తువులు ఏవైనా వాడరాదంటూ వింగ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు వింగ్ అధికారులు తమ తమ సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ఉల్లంఘించినట్లైతే చట్టపరమైన చర్యలు తప్పవని, పర్యావరణ పరిరక్షణలో జీడబ్ల్యూఎంసీ పాత్ర ప్రశంసనీయంగా ఉండాలని కమిషనర్ గౌతమ్ అధికారులకు సూచించారు.పాకాల చెరువుకట్ట వద్ద ప్లాస్టిక్ నిషేధంపాకాల చెరువు కట్టపై ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పరిశుభ్రమైన వాతావరణానికి అడుగులు పడ్డాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతిని ఆరాధిస్తూనే అధికారులు తీసుకున్న చర్యలను ప్రశంసిస్తున్నారు. ముగ్ధులయ్యారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఏకైక పర్యాటక ప్రదేశమైన ఖానాపురం మండలంలోని పాకాలలో పర్యాటకులు సందడి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు పాకాల అందాలను వీక్షించడానికి వస్తుంటారు. దీంతో కట్టపొడవునా, పార్కులో, తూములపైన, కట్ట దిగువ ప్రాంతంలో పర్యాటకులతో పాకాల కళకళలాడుతుంటుంది. కొందరు పాకాల అందాలతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. పర్యాటకులు అందులో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. అయితే ఇక్కడ ప్లాస్టిక్ వాడకుండా గ్టటి చర్యలు తీసుకున్నారు.