ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
కోదాడ ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదాం
;మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ జూలై 07 ( జనంసాక్షి )
ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు.గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి కళాశాల,పాఠశాల విద్యార్థులచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పట్ల కలిగే అనర్ధాలపై ప్లకార్డులను ప్రదర్శిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా పట్టణ పౌరులందరూ సహకరించాలన్నారు.ప్రజలందరి సహకారంతోనే కోదాడను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం ఉంటుందన్నారు.భారత ప్రభుత్వం 120 మైక్రాన్ ల కంటే
తక్కువ మందంగల ప్లాస్టిక్ వస్తువుల పై జులై ఒకటవ తారీకు నుండి నిషేధం ఉందని పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకుండా సహకరించాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు జరిపిన వినియోగించిన జరిమానా విధిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,డి.ఎస్.పి వెంకటేశ్వర రెడ్డి,ఆడప నర్సింహారావు,వార్డ్ కౌన్సిలర్స్ పెండెం వెంకటేశ్వర్లు,కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్,షేక్ మాధార్,గుండెల సూర్యనారాయణ,మైసా రమేష్,షేక్ ఖథీర్ పాషా,బత్తినేని హనుమంతరావు,
తిపిరిశెట్టీ సుశీల రాజు,మహమూద్ ఫాతిమా ఖాజా,బ్రహ్మం,యేసయ్య,వివిధ విద్య సంస్థల విద్యార్థిని విద్యార్ధులు,మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, మరియు మెప్మ సిబ్బంది పాల్గొన్నారు.