ఫిబ్రవరిలో ఆర్‌బిఐ పరపతి సవిూక్ష
బ్యాంకర్లతో భేటీ అయిన శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ,జనవరి28(జనంసాక్షి): త్వరలో పరపతి విధాన సవిూక్ష ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సీఈవోలతో భేటీ అయ్యారు. బ్యాంకింగ్ రంగం నుంచి ప్రభుత్వం ఏమి ఆశిస్తోందో అనే విషయాన్ని తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఆరో పరపతి విధాన సవిూక్ష జరగనుంది. బ్యాంకింగ్ రంగం నుంచి ఆర్‌బీఐ ఏమి ఆశిస్తోందో వారికి తెలియజెప్పడం కోసం భేటీ అయ్యాము. దీంతోపాటు ప్రస్తుత, భవిష్యత్తు అంశాలపై చర్చంచామని శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఫిబ్రవరిలో జరగబోయే పరపతి సవిూక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమ పాలసీలో సవరణలు తీసుకొచ్చి నిధుల లభ్యతను పెంచవచ్చు. గత ఏడాదితో పోలిస్తే సీపీఐ సగానికి పైగా తగ్గుముఖం పట్టింది.