ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
షాపింగ్ మాల్స్ మూసేయించిన అధికారులు
ప్యారిస్,డిసెంబర్8(జనంసాక్షి): ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈఫిల్ టవర్ ను మూసివేశారు. ఇంధనంపై పన్నులు, పెరుగుతున్నఖర్చులను వ్యతిరేకిస్తూ రెండు వారాలుగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిస్‌లో ఉండే షాపింగ్‌మాల్స్, మ్యూజియమ్స్, థియేటర్స్‌లను కూడా అధికారులు మూసివేశారు .ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్‌లోనే 133 మంది గాయపడ్డారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్‌లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం. దీంతో ప్రభుత్వం అత్యవసర స్థితిని విధించే ఆలోచనలో ఉంది.