ఫ్రీడమ్ 2కె రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కందళ

కూసుమంచి ఆగస్టు 11 (జనం సాక్షి): స్వాతంత్ర సంగ్రామ వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మండలంలోని బస్టాండ్ సెంటర్ నుండి నేషనల్ హైవే వరకు ఉదయం 6 గంటలకు జాతీయ పతాకాన్ని ఊపి రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు, మండల పరిషత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్, డిసిసిబి డైరెక్ట్ ఇంటూరి శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, తెరాస అధ్యక్ష కార్యదర్శులు వేముల వీరన్న ఆసిఫ్ పాషా, సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్సై యాసా నందీప్, మలిద్ వెంకన్న కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్, మండల అభివృద్ధి అధికారి కరుణాకర్ రెడ్డి, మండల తహసిల్దార్ మీనన్, మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, స్వచ్ఛందంగా పాల్గొని 2కే రన్ ను విజయవంతం చేశారు.