బండి సంజయ్ అరెస్టు ను నిరసిస్తూ బిజెపి నిరసన

జనంసాక్షి  రాజంపేట్
రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా రాజంపేట్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టడం జరిగింది మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల బిజెపి పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నీనాదాలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం బిజెపి నాయకుల పై అక్రమ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రశాంతంగా నిర్వహిస్తున్న బండి సంజయ్ యాత్రను అడ్డుకొని అక్రమ అరెస్టు చేయడం తగదని తెలిపారు రాబోయే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వంకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలిపారు నిరసన కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీను మండల ఉపాధ్యక్షులు రాజేందర్ రావు వివిధ గ్రామ అధ్యక్షులు గుర్రాల రామ్ కుమ్మరి రమేష్ దుర్గాప్రసాద్ సంతోష్ మరియు కమ్మరి నాగరాజు రాజిరెడ్డి బాల్ నర్సింలు  కార్యకర్తలు పాల్గొన్నారు