బండి సంజయ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బిఅర్ఎస్ శ్రేణులు.
కోటగిరి మార్చి 12 జనం సాక్షి:-బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ బిఆర్ఎస్ ఉమ్మడి కోటగిరి మండల శ్రేణులు నిరసనలు,ఆందోళనలు చేపట్టారు.ఆదివారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.అనంత రం బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా పలువురు బిఅర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఖబర్దార్ బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు.ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని మండల బిఆర్ఎస్ పార్టీ వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్,జడ్పిటిసి శంకర్ పటేల్,స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తేల్ల అరవింద్,నీరడి గంగాధర్,మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు,మాజీ సర్పంచ్ ఆనంద్,పి.సాయిలు, మీర్జాపుర్ చిన్న సాయన్న,మండల సర్పంచులు, ఎంపీటీసీలు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.