బకాల్వాడీ అభివృద్ధి కి కృషి చేస్తా ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్థ మిర్యాలగూడ, జనం సాక్షి. పట్టణం లోని బకాల్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ అన్నారు. గురువారం బకాల్వాడ పాఠశాల లో ఏర్పాటు చేసిన ఉచిత పాడ్స్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో పారిశుద్ధ అవసరాల నిమిత్తం ఒక ప్రైవేట్ స్వీపర్ ను ఏర్పాటు చేసేందుకు తాను ప్రతి నెల 5000 రూపాయలు తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బాలికలకు అవసరమయ్యే సానిటరీ పాడ్స్ కూడా ఉచితంగా అందిస్తామని పాఠశాల అభివృద్ధి కమిటీ కన్వీనర్ చిలకోల శ్రీధర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీప్రసన్న విద్యార్థులకు ఆరోగ్య సూచనలు,సలహాలు ఇవ్వగా అంగన్వాడీ టీచర్లు జ్యోతి, పుష్పలత, నాగరాణి, ఝాన్సీ,పద్మావతి ,సుజాత, సైదమ్మ,అప్పమాంబ,పద్మజ లు స్వీయ రక్షణ మెలుకువలు చెప్పారు.కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి,వార్డ్ కౌన్సిలర్ తలకోల సుజాత తదితరులు ఉన్నారు.

మిర్యాలగూడ, జనం సాక్షి.పట్టణం లోని బకాల్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ అన్నారు. గురువారం బకాల్వాడ పాఠశాల లో ఏర్పాటు చేసిన ఉచిత పాడ్స్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో పారిశుద్ధ అవసరాల నిమిత్తం ఒక ప్రైవేట్ స్వీపర్ ను ఏర్పాటు చేసేందుకు తాను ప్రతి నెల 5000 రూపాయలు తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బాలికలకు అవసరమయ్యే సానిటరీ పాడ్స్ కూడా ఉచితంగా అందిస్తామని పాఠశాల అభివృద్ధి కమిటీ కన్వీనర్  చిలకోల శ్రీధర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీప్రసన్న విద్యార్థులకు ఆరోగ్య సూచనలు,సలహాలు ఇవ్వగా  అంగన్వాడీ టీచర్లు జ్యోతి, పుష్పలత, నాగరాణి, ఝాన్సీ,పద్మావతి ,సుజాత, సైదమ్మ,అప్పమాంబ,పద్మజ లు స్వీయ రక్షణ మెలుకువలు చెప్పారు.కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి,వార్డ్ కౌన్సిలర్ తలకోల సుజాత తదితరులు ఉన్నారు.