బతుకమ్మచీరలు..ఆడపడుచులకు వరాలు.

– ఎంపీపీ బక్క రాధజంగయ్య.
ఊరుకొండ, సెప్టెంబర్ 27 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఆడపంచులకు వరాలు అని ఎంపీపీ బక్క రాధజంగయ్య అన్నారు. మంగళవారం
ఊరుకొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగాన్ పల్లి, మాధారం గ్రామాలలో సర్పంచ్ లు విజయమ్మ పాండురంగారెడ్డి, రజిత కృష్ణయ్య, బొబ్బిలి సునీత సాంబశివుడు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల దగ్గర బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా లక్ష్మన్న ఆదేశాల మేరకు బతుకమ్మ చీరల పంపిణీ ఒకటి అనీ,
మన సంస్కృతి, సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు గొప్ప పండుగ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అండగా ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం అందజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలంతా తమ సొంత ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ దసరా పండుగలను చాలా అంగరంగవైభవంగ జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్, జెడ్పిటిసి శాంత కుమారి రవీందర్, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ లు పరశురాం, నరసింహ, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రమేష్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, ఎంపిటిసి లావణ్య అమరేష్ రెడ్డి, కోఆప్షన్ కలీం పాషా, తెరాస మండల నాయకులు బచ్చలకూర రమేష్, కొమ్ము శ్రీను, సందిప్ కుమార్, పులిజ్వాల చంద్రకాంత్, మొండేళ్ల శ్రీశైలం, నూరుద్దీన్, మల్లేష్, వార్డు మెంబర్ రాములు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.