బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్… గిరబోయిన భాగ్యలక్ష్మి

బచ్చన్నపేట సెప్టెంబర్ 25 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంటికి పెద్దన్నగా ఆడపడుచులకు చీరలను అందజేస్తున్నారని జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. సోమవారం మండలంలోని చిన్నదామచర్ల. గోపాల్ నగర్ . బసిరెడ్డిపల్లి. బోన కొల్లూరు. గంగాపూర్. లింగంపల్లి. నారాయణపూర్. కొడవటూర్. నాగిరెడ్డిపల్లి. గ్రామాలలో బతుకమ్మ చీరల పంపకం సర్పంచులు గ్రామ కార్యదర్శుల చేతుల మీదుగా అందచేయడం జరిగిందని ఆమె తెలిపారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ. భారత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పూలను పూజిస్తూ ప్రకృతిని దైవంగా భావించే గొప్ప సాంస్కృతి తెలంగాణలోనే ఉందని అలాంటి తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులను తన సొంత తోబుట్టువులుగా గౌరవిస్తూ ఇంటింటికి కోటికి పైగా చీరలు అందించారని అన్నారు. అంతేకాకుండా స్వరాష్ట్రంలో పద్మశాలీలకు ఉపాధి కల్పిస్తూ చేనేత తోటి కోరుకున్నటువంటి శారీలను మరియు రుమాళ్ళు. మగవారు ధరించే అటువంటి పట్టు తోటి కూడుకున్నటువంటి ఖాది బట్టలను తయారు చేయించి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్ భారతదేశం లో చేనేత కార్మికులకు ఉన్నటువంటి గౌరవాన్ని వృత్తి నైపుణ్యాన్ని గుర్తించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని ఆమె అన్నారు. తెలంగాణలోనే కాకుండా భారతదేశ రాజకీయాలని శాసించే శక్తి ఒక్క కేసీఆర్ కి ఉందని ఆమె తెలిపారు. చిన్నరామచర్ల గ్రామ సర్పంచ్. కళినా బేగం ఆజాం. బోన కొల్లూరు సర్పంచ్ ఐలుమల్లు. బసిరెడ్డిపల్లి సర్పంచ్ బాలగోని పరశురాములు. లింగంపల్లి సర్పంచ్ మల్లేష్. నారాయణపూర్ సర్పంచ్ మాసాపేట రవీందర్ రెడ్డి. గంగాపూర్ సర్పంచ్ సుశీల. నాగిరెడ్డిపల్లి సర్పంచ్ భవాని. సాల్వాపూర్ సర్పంచ్ కీసర లక్ష్మి. ఎంపీటీసీ గూడెపు లతా శ్రీ. కొన్ని సర్పంచ్ వేముల వెంకటేష్ గౌడ్. ఆయా గ్రామాలలో సర్పంచులు . ఎంపీటీసీలు. గ్రామ కార్యదర్శులు. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది అన్నారు