బతుకమ్మ చీరాల పంపిణీ

డోర్నకల్,సెప్టెంబర్ 26,జనం సాక్షి :

తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తోందని అందనాలపాడు సర్పంచ్ అంగోత్ మోహన్ అన్నారు. సోమవారం డోర్నకల్ మండల పరిధిలోని అందనాల పాడు గ్రామంలో ఆయన చేతుల మీదుగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్ఠతను ప్రపంచానికి చాటిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కుతుందని వారు అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వారు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల యూత్ అధ్యక్షు లు హరీష్, ఎంపిటిసి ఆంగోత్ నీల రమేష్,మాజీ సర్పంచ్ అప్పారావు, మంగ్య సాధు,గ్రామ పార్టీ అధ్యక్షులు మోహన్ రావు,ఎస్టీ సెల్ నాయకులు అంగోత్ ల చ్చు,రాజు,ఉప సర్పంచ్ రాంబాబు,వార్డు సభ్యులు నారాయణ,తిరుపతమ్మ, శాంత,బిక్షమయ్య,రాజేష్, బాబూ, అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.