బయ్యారంలో ప్లాంటుపై నేతల వాగ్దానాలను కొట్టిపారేసిన

బయ్యారంపై కాంగ్రేస్‌ వైఖరి..బొయ్యారమే

ఉన్నదంత ఊడ్చుకుపోతామంటున్న నేతలు

బొత్సమాటలు

మెమో జారీతోనే తలెత్తిన అనుమానాలు

హైదరాబాద్‌; ఏప్రిల్‌22; బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఏర్పాటు చేయాలి…ఇది తెలంగాణ ప్రజల డిమాండ్‌! బయ్యారంలో దశలవారిగా స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటవుతుంది…ఇది ప్రభుత్వం ఊదరగొడుతున్న హామీ! ప్లాంటు వచ్చితీరుతుంది…ఇది కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌…విప్‌ మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రేస్‌ నేతల ఉద్ఘాటన! ప్లాంట్‌ కడతామని చెబుతున్నా…తెలంగాణావాదులు ప్లాంటు కోసం డిమాండ్‌ చేస్తున్నారన్న వాతావరణాన్ని సృష్టించిన వ్యాఖ్యాలు! అయితే… నిజం నిలకడమీదే తెలుస్తుంది.ఆ నిజం సాక్షాత్తు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ మాటల్లో బయటికి వచ్చింది.