బయ్యారం కోసం కలెక్టరేట్‌ ముట్టడి

వరంగల్‌, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం బీజేపీ కదం తొక్కింది. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతల అధ్వర్యంలో ఆపార్టీ కార్యకర్తలు ఇవాళ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోవడానికి కార్యకర్తలు ప్రయత్నించారు. కార్యకర్తలను అడ్డుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.దీంతో నగరంలో తీవ్ర ఉధ్రిక్తత ఏర్పడింది.