‘బయ్యారం గనులపై వైఖరి స్పష్టం చేయండి’

హైదరాబాద్‌;బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల వైఖరి స్పష్టంచేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టీ.హరీష్‌రావు శనివారం హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. వీరిద్దరు ఒకే ఎజెండాతో పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులు స్పందించేందుకుంటే వారి ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని హరీష్‌రావు హెచ్చరించారు.ఖమ్మం జిల్లాలో కనిజ నిల్వలు అపారంగా ఉన్నాయని తెలిపారు. ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు కావటసిన అన్ని వనరులు ఖమ్మంలో ఉన్నాయన్నారు.విశాఖలో ఉక్కు కార్మాగారం, తెలంగాణలో శుద్ధి కేంద్రమా అని హరీష్‌రావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలంగాణ ఖనిజ సంపదను కొల్ల గొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.బయ్యారంలోని ఒక్క కనిజ ముక్కను కూడా విశాఖపట్నం తరలి వెళ్లకుండా అడ్డుకుంటామని హరీష్‌రావు హెచ్చరించారు.