బషీర్‌బాగ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు
హైదరాబాద్, జనంసాక్షి: నగరం నడిబొడ్డు బషీర్‌బాగ్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి ప్రమాదం సంభవించింది. పాత గాంధీ మెడికల్ కాలేజీ భవనం ఎదురుగా ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నింస్తున్నారు. కాగా, అగ్నికీలల దాటికి అక్కడ ఉన్న ముప్పై బైకులు పూర్తిగా దగ్దమయ్యాయి. కాగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎగిరిపడిన ఆయిల్ కారణ:ఘా ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డట్టు సమాచారం.