బహుజనుల ఆరాధ్యులు అపరమేధావి రావణాసురుని వద ఆపాలి
టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనంసాక్షి ): బహుజనుల ఆరాధ్యులు అపర మేధావి రావణాసురుని వద ఆపాలి అని టీపీఎఫ్ జిల్లా నాయకులు మెంతెన సంజీవరావు, తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తీ సత్యనారాయణ,తుడుందెబ్బా జిల్లా కార్యదర్శి దుగ్గరపు వీరభద్రంలు మాట్లాడుతూ భారతదేశంలోకి ఆర్యులువచ్చి ఈ దేశంలో మనుస్ముతిని కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాలన కొనసాగించారు. స్థిర ,మూల ,ఆది నివాసులైనటువంటి రాజుల చరిత్ర మనుగడలో లేకుండా చేసినారు. చరిత్రలో జంబుద్వీపం పేరుతో పిలవబడే భారత దేశ చరిత్రను ఆర్యులు కుల మతాలుగా విభజించి ఈ దేశ రాజులైన రావణుడు, మహిషాసురుడు, తాటకి ,సూర్పనక వంటి వీరుల చరిత్రను కనుమరుగు చేసి వారిని రాక్షసులుగా చిత్రించినారు. ఏ దేశంలోనైనా ఇద్దరి మద్య యుద్ధం జరిగినప్పడు విజయులుగానో ,అపజయులుగా గుర్తిస్తారు, కానీ భారత దేశం లో ఒకరిని రాక్షసుడిగా మరొకరిని దేవుడిగా కీర్తిస్తున్నారు. 1600 మంది గోపికల వస్త్రాలను దొంగలించినటువంటి శ్రీకృష్ణుడిని దేవుడిగాను, చరిత్రలో సీతను తాకని రావణుడిని మాత్రం రాక్షసుడిగా చెప్తున్నటువంటి పుక్కిడి పురాణాలు శాస్త్రీయమైనవి కావు అని అన్నారు. కాబట్టి ప్రతి దసరా రోజున రావణ దహనం చేయడం ఆపివేయాలి, అందులోబాగంగనే అక్టోబర్ 5న జరిగే రావణవదని నిలిపివేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మెంతిని ప్రభాకర్, ఏపీ వైఎస్ జిల్లా నాయకులు ఎట్టి ప్రశాంత్, కొండలు, రాజు, దేవేందర్ ,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.