బహుజన బతుకమ్మ స్ఫూర్తితో కుల నిర్మూలన పోరాటాలు ఎత్తి పడుదాం..

రాజేశ్వరి శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్.

వేములవాడలో బహుజన బతుకమ్మ పోస్టర్ల ఆవిష్కరణ.
వేములవాడ సెప్టెంబర్ 24 (జనంసాక్షి)
పూలను పూజించే సంస్కృతి లో రూపుదిద్దుకున్న బహుజన బతుకమ్మ స్ఫూర్తితో కుల నిర్మూలన పోరాటాలను ఎత్తి పట్టవల్సివుందని శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాజేశ్వరి అన్నారు.
శనివారం వేములవాడలో బీడీ కార్మికులుతో కలిసి బహుజన బతుకమ్మ పోస్టర్లు ,కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ స్ఫూర్తితో ప్రజల్లో సాంస్కృతిక చైతన్యం నింపేందుకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్వర్యంలో బహుజన బతుకమ్మ వేడుకలను వేదికగా చేసుకుని ముందుకు సాగుతుందని అన్నారు.
గడిచిన 13సంవత్సరాలు గా సమాజంలోని అనేక అనిచివేతలను నిరసిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుందని అన్నారు.
ఈ సారి ప్రధానంగా సమాజంలోని కుల వివక్షకు వ్యతిరేకంగా కుల నిర్మూలన పోరాటాలను ఎత్తి పడుతూ బహుజన బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రారంభమైన వేడుకలు అక్టోబర్ 4 దాకా సాగుతాయని,
వేములవాడ పట్టణంలో అక్టోబర్ 1న వేములవాడలో బహుజన బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ కామ్రేడ్ విమలక్క పలువురు హాజరు అవుతారని ఆడబిడ్డలు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో
శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాల్లు మనేవ్వ, పద్మాక్క, రంభాయి విద్యార్థి సంఘ నాయకులు పోకల సాయికుమార్, మల్లేష్,
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.