బాణోత్ వసంత్ రావ్ మరణం బాధాకరం.

జనం సాక్షి ఉట్నూర్.
అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబాన్ని ఓదార్చిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్.
సేవా దాస్ నగర్ కు చెందిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ సంఘ నాయకుడు.బాణోత్ వసంత్ సాయంత్రం అనారోగ్యం తో చనిపోయారు.అయితే ఈరోజు వసంత్ రావ్ అంత్య క్రియలు ఉట్నూర్ లో నిర్వహించగా ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్అంతిమ యాత్రలో పాల్గొని.వసంత్ రావ్  మరణం బాధ కరమని. ఉపాధ్యాయ వృత్తి లో ఉండి ఆయన చేసిన సేవలు మరవ లేనివని అన్నారు. ఈ సందర్బంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి ని తెలియ చేశారు.
2 Attachments