బాధితురాలి మృతదేహానికి ప్రధాని, సోనియా నివాళులు
న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంథీ పరామర్శించారు. ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రథాని, సోనియా బాధితురాలి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు.దక్షణ ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌లోచికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి మృతదేహాన్ని ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి తరలించారు.