బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ :నెరడిగొండ
మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన బానోత్ పిప్లి బాయి ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాంతో పాటు మండల ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు నారాయణ కిసాన్ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి భీమ్ రావు చందులాల్ పద్దు రాజేశ్వర్ దేశాయ్ పాండు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.